Posted

మావోయిస్టుల్ని ఏరివెయ్యడానికి ఆధార్ కార్డులు అవసరం అని ప్రభుత్వం చెపుతోంది కానీ మావోయిస్టుల దగ్గర కూడా ఆధార్ కార్డులు ఉంటాయి. లొంగిపోయిన మావోయిస్టుల దగ్గర ఆధార్ కార్డులు లాక్కుని, వాళ్ళ పేరుతో బ్యాంక్‌లో బేనామీ అకౌంట్లు ఓపెన్ చేసి, రీహేబిలిటేషన్ చెక్కులు డిపాజిట్ చేసే ఆఫీసర్లు ఉన్నారు. ఈ విషయం ఝార్ఖండ్ ప్రభుత్వానికి తెలిసిపోయింది. లొంగిపోయిన తీవ్రవాదులకి కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి రీహేబిలిటేషన్ డబ్బులు ఇస్తామని ఝార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్ కార్డ్ లేకపోతే బ్యాంక్ అకౌంటే ఓపెన్ అవ్వదు. బ్యాంక్ అకౌంట్ లేకపోతే చెక్ పని చెయ్యదు. లొంగిపోయిన తీవ్రవాదులకి చెక్కులు ఇస్తున్నారంటే దాని అర్థం తీవ్రవాదులకి కూడా బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు ఉన్నట్టే కదా.

Author
Categories Meaningless labor

Posted

సి.పి.ఐ.(మావోయిస్ట్) మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జినుగ నరసింహారెడ్డి (జంపన్న) లొంగిపోయి, ప్రభుత్వం దగ్గర లక్షలు రివార్డ్ తీసుకున్న తరువాత కూడా ఫేస్‌బుక్‌లోనూ, పత్రికా ఇంటర్వ్యూలలోనూ మార్క్సిజం కబుర్లు చెపుతున్నాడు. అతన్ని నమ్మొచ్చా? గతంలో శివసాగర్ (కె.జి. సత్యమూర్తి) అనే విప్లవ కవి & నక్సల్ లీడర్ ఉండేవాడు. శివసాగర్‌కి కులానికీ, వర్గానికీ మధ్య తేడా తెలియదు. శివసాగర్ లొంగిపోయిన తరువాత అతనికి బెయిల్ తొందరగానే వచ్చింది. అతను శ్రమిక వర్గ పార్టీలో మళ్ళీ చేరే అవకాశం లేదు కనుక ప్రభుత్వం అతనికి బెయిల్ ఇచ్చింది. మరి జంపన్నకి బెయిల్‌తో పాటు రివార్డ్ కూడా ఎందుకు ఇచ్చినట్టు? "నీ కంటే ముందు లొంగిపోయిన దున్న కేశవరావుకే బెయిల్ రాలేదు. నువ్వు లొంగిపోయి, పార్టీ రహస్యాలు ప్రభుత్వానికి చెప్పి, బెయిల్ తీసుకున్న తరువాత కూడా మార్క్సిజం కబుర్లు ఎలా చెపుతున్నావు?" అని నేను జంపన్నని ఫేస్‌బుక్‌లో అడిగాను. "అదంతా ఇంటలిజెన్స్ ఆఫీసర్లనే అడుగు" అని జంపన్న నన్ను తిట్టాడు. వ్యక్తిగత పాపులారిటీ కోసం మార్క్సిజం కబుర్లు చెప్పేవాడికి కూడా లక్షలు రివార్డ్ ఇచ్చి మేపొచ్చా అని నా డౌట్. రాయగడ జిల్లాలో క్రైమ్ రేట్ ఎక్కువ. ఇక్కడ దొంగలు, గంజాయి స్మగ్లర్లు కేవలం బెయిల్ కోసం లొంగిపోతుంటారు. లాయర్లకి ఫీజ్ కడితే వాళ్ళు వీళ్ళ మీద ఏ కోర్ట్‌లో నాన్ బెయిలెబుల్ వారెంట్ ఉందో తెలుసుకుని వీళ్ళని ఆ కోర్ట్‌లో సరెండర్ చెయ్యిస్తారు. పార్టీ రహస్యాలు చెప్పిన మాజీ నక్సల్స్‌కి బెయిల్ తప్పకుండా వస్తుంది కదా, మరి వీళ్ళకి రివార్డులు ఇచ్చి మేపడం ఎందుకు?

నక్సల్స్‌లో కొంత మంది మార్క్సిజం తెలియక లొంగిపోతారు, కొంత మందికి మార్క్సిజం తెలిసినా సొంత ఆస్తి మీద ఆశపుట్టి లొంగిపోతారు. జంపన్న సొంత ఆస్తి మీద ఆశపుట్టి లొంగిపోయాడు. సొంత ఆస్తి మీద ఆశపుట్టి లొంగిపోయినవాడిని ప్రభుత్వం సివిలియన్‌గా భావిస్తే సరిపోతుంది. అతనికి రివార్డ్ ఇచ్చి మేపాల్సిన అవసరం లేదు.

Author
Categories Hope for the future

Posted

నేను విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో మార్క్సిజం చదివాను. నేను సొంత ఆస్తిని వదులుకోలేక ఏ మార్క్సిస్ట్ సంస్థలో చేరలేదు. అది కోర్ట్ కేసులో చాలా కష్టం మీద వచ్చిన ఆస్తి. ఆ ఆస్తిని నేను వదులుకోలేను. కమ్యూనిజాన్ని పూర్తిగా వ్యతిరేకించిన రావిపూడి వెంకటాద్రి గారి మృతిపై కమ్యూనిస్టులైన విరసం సభ్యులు ఎందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు? కమ్యూనిజం వేరు, హేతువాదం వేరు. కమ్యూనిజానికీ, హేతువాదానికీ మధ్య తేడా తెలియనివాళ్ళు ఉన్నారని వెంకటాద్రి గారితో చాలా కాలం పని చేసిన పెన్మెత్స సుబ్బరాజు గారే వివేక మార్గం పుస్తకంలో రాసారు. “కమ్యూనిజం అంటే సొంత ఆస్తిని రద్దు చేసి ఉమ్మడి ఆస్తిని స్థాపించడం”. కమ్యూనిజం గురించి ప్రజలకి ఈ ఒక్క ముక్కలో అర్థమయ్యేలా చెప్పడం సి.పి.ఐ., సి.పి.ఎం.ల నాయకులకి చేతకాదు, విరసం నాయకులకి కూడా చేత కాదు. కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాల వల్ల బాధపడేవాళ్ళు హేతువాద సంఘాలని పేట్రనైజ్ చేస్తారు. “కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలు పోతే చాలు, ఆర్థిక సమానత్వం రాకపోయినా పర్వాలేదు” అనుకుంటే కమ్యూనిస్టుల సిద్ధాంతం అది కాదు. మార్క్సిజానికి వ్యతిరేకమైన కొడవటిగంటి గారి దెయ్యాల తత్వశాస్త్రం ప్రచురించి మార్క్సిజం పరువు తీసిన విరసంవాళ్ళు దేవుడు & దెయ్యాలు లేవు అని చెప్పిన ఒక హేతువాది చావుపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Author
Categories Hope for the future

Posted

సినిమాల్లో విలన్ కొడుకు ఏక్సిడెంట్ చేస్తాడు, విలన్ కార్ డ్రైవర్‌ని సరెండర్ చెయ్యిస్తాడు. నిజజీవితంలో పోలీసులు సరెండర్‌ని అంత సులభంగా నమ్మరు. మా ఊరి బస్ ఓనర్ లైసెన్స్ లేని డ్రైవర్ చేత బస్ నడిపించాడు. అది ఏక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. డ్రైవర్‌కి లైసెన్స్ లేదనే విషయం బయటపడకూడదని ఓనర్ తన సొంత డ్రైవింగ్ లైసెన్స్ చూపించి సరెండర్ అయ్యాడు. పోలీసులు ఓనర్ మీదే కేస్ రాసారు. ఇప్పుడు ఓనర్ కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాడు.

నక్సల్ సరెండర్స్‌ని కూడా పోలీసులు అంత సులభంగా నమ్మరు. 2011లో సరెండర్ అయిన దున్న కేశవరావుకి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన దున్న కేశవరావు ఒడిశాలో పని చేసాడు. అతను తమకి చెప్పకుండా లొంగిపోయాడని ఒడిశా పోలీసులు ఆంధ్ర పోలీసులకి చెప్పడంతో ఆంధ్ర పోలీసులు అతన్ని ఒడిశా అధికారులకి అప్పగించారు. ఒడిశా అధికారులు అతనికి భుబనేశ్వర్ జైలులో నరకం చూపించారు. కేశవరావు ఒడిశా పోలీసులకి చెప్పే లొంగిపోయాడు. అతను డి.జి.పి. ముందు లొంగిపోవడం వల్ల అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. రెండు రాష్ట్రాలలో అతనితో కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు అడ్రెస్‌లు మార్చేసారు. వాళ్ళ అడ్రెస్‌లు చెప్పలేకపోవడం వల్లే పోలీసులు కేశవరావుకి నరకం చూపించారు. అతను పబ్లిసిటీ కోసం డి.జి.పి. ముందు లొంగిపోయాడు కానీ ఆ పబ్లిసిటీ వల్ల రెండు రాష్ట్రాల్లో అతని కాంటాక్ట్స్ అడ్రెస్‌లు మార్చేసారు. చివరికి కేశవరావే గంగలో మునిగాడు. పది లక్షకు రివార్డ్‌కి ఆశపడి లొంగిపోతే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అయ్యింది.

Author
Categories Hope for the future