సి.పి.ఐ.(మావోయిస్ట్) మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జినుగ నరసింహారెడ్డి (జంపన్న) లొంగిపోయి, ప్రభుత్వం దగ్గర లక్షలు రివార్డ్ తీసుకున్న తరువాత కూడా ఫేస్‌బుక్‌లోనూ, పత్రికా ఇంటర్వ్యూలలోనూ మార్క్సిజం కబుర్లు చెపుతున్నాడు. అతన్ని నమ్మొచ్చా? గతంలో శివసాగర్ (కె.జి. సత్యమూర్తి) అనే విప్లవ కవి & నక్సల్ లీడర్ ఉండేవాడు. శివసాగర్‌కి కులానికీ, వర్గానికీ మధ్య తేడా తెలియదు. శివసాగర్ లొంగిపోయిన తరువాత అతనికి బెయిల్ తొందరగానే వచ్చింది. అతను శ్రమిక వర్గ పార్టీలో మళ్ళీ చేరే అవకాశం లేదు కనుక ప్రభుత్వం అతనికి బెయిల్ ఇచ్చింది. మరి జంపన్నకి బెయిల్‌తో పాటు రివార్డ్ కూడా ఎందుకు ఇచ్చినట్టు? "నీ కంటే ముందు లొంగిపోయిన దున్న కేశవరావుకే బెయిల్ రాలేదు. నువ్వు లొంగిపోయి, పార్టీ రహస్యాలు ప్రభుత్వానికి చెప్పి, బెయిల్ తీసుకున్న తరువాత కూడా మార్క్సిజం కబుర్లు ఎలా చెపుతున్నావు?" అని నేను జంపన్నని ఫేస్‌బుక్‌లో అడిగాను. "అదంతా ఇంటలిజెన్స్ ఆఫీసర్లనే అడుగు" అని జంపన్న నన్ను తిట్టాడు. వ్యక్తిగత పాపులారిటీ కోసం మార్క్సిజం కబుర్లు చెప్పేవాడికి కూడా లక్షలు రివార్డ్ ఇచ్చి మేపొచ్చా అని నా డౌట్. రాయగడ జిల్లాలో క్రైమ్ రేట్ ఎక్కువ. ఇక్కడ దొంగలు, గంజాయి స్మగ్లర్లు కేవలం బెయిల్ కోసం లొంగిపోతుంటారు. లాయర్లకి ఫీజ్ కడితే వాళ్ళు వీళ్ళ మీద ఏ కోర్ట్‌లో నాన్ బెయిలెబుల్ వారెంట్ ఉందో తెలుసుకుని వీళ్ళని ఆ కోర్ట్‌లో సరెండర్ చెయ్యిస్తారు. పార్టీ రహస్యాలు చెప్పిన మాజీ నక్సల్స్‌కి బెయిల్ తప్పకుండా వస్తుంది కదా, మరి వీళ్ళకి రివార్డులు ఇచ్చి మేపడం ఎందుకు?
నక్సల్స్‌లో కొంత మంది మార్క్సిజం తెలియక లొంగిపోతారు, కొంత మందికి మార్క్సిజం తెలిసినా సొంత ఆస్తి మీద ఆశపుట్టి లొంగిపోతారు. జంపన్న సొంత ఆస్తి మీద ఆశపుట్టి లొంగిపోయాడు. సొంత ఆస్తి మీద ఆశపుట్టి లొంగిపోయినవాడిని ప్రభుత్వం సివిలియన్‌గా భావిస్తే సరిపోతుంది. అతనికి రివార్డ్ ఇచ్చి మేపాల్సిన అవసరం లేదు.
జినుగ నరసింహారెడ్డి(జంపన్న)ని అనవసరంగా మేపుతున్న ఇంటలిజెన్స్ ఆఫీసర్లు
Posted
Author
Administrator
Categories
Hope for the future