రావిపూడి వెంకటాద్రి మృతిపై కమ్యూనిస్టులకి సంతాపం అవసరమా?

Posted

నేను విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో మార్క్సిజం చదివాను. నేను సొంత ఆస్తిని వదులుకోలేక ఏ మార్క్సిస్ట్ సంస్థలో చేరలేదు. అది కోర్ట్ కేసులో చాలా కష్టం మీద వచ్చిన ఆస్తి. ఆ ఆస్తిని నేను వదులుకోలేను. కమ్యూనిజాన్ని పూర్తిగా వ్యతిరేకించిన రావిపూడి వెంకటాద్రి గారి మృతిపై కమ్యూనిస్టులైన విరసం సభ్యులు ఎందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు? కమ్యూనిజం వేరు, హేతువాదం వేరు. కమ్యూనిజానికీ, హేతువాదానికీ మధ్య తేడా తెలియనివాళ్ళు ఉన్నారని వెంకటాద్రి గారితో చాలా కాలం పని చేసిన పెన్మెత్స సుబ్బరాజు గారే వివేక మార్గం పుస్తకంలో రాసారు. “కమ్యూనిజం అంటే సొంత ఆస్తిని రద్దు చేసి ఉమ్మడి ఆస్తిని స్థాపించడం”. కమ్యూనిజం గురించి ప్రజలకి ఈ ఒక్క ముక్కలో అర్థమయ్యేలా చెప్పడం సి.పి.ఐ., సి.పి.ఎం.ల నాయకులకి చేతకాదు, విరసం నాయకులకి కూడా చేత కాదు. కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాల వల్ల బాధపడేవాళ్ళు హేతువాద సంఘాలని పేట్రనైజ్ చేస్తారు. “కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలు పోతే చాలు, ఆర్థిక సమానత్వం రాకపోయినా పర్వాలేదు” అనుకుంటే కమ్యూనిస్టుల సిద్ధాంతం అది కాదు. మార్క్సిజానికి వ్యతిరేకమైన కొడవటిగంటి గారి దెయ్యాల తత్వశాస్త్రం ప్రచురించి మార్క్సిజం పరువు తీసిన విరసంవాళ్ళు దేవుడు & దెయ్యాలు లేవు అని చెప్పిన ఒక హేతువాది చావుపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Author
Categories Hope for the future