సినిమాల్లో విలన్ కొడుకు ఏక్సిడెంట్ చేస్తాడు, విలన్ కార్ డ్రైవర్‌ని సరెండర్ చెయ్యిస్తాడు. నిజజీవితంలో పోలీసులు సరెండర్‌ని అంత సులభంగా నమ్మరు. మా ఊరి బస్ ఓనర్ లైసెన్స్ లేని డ్రైవర్ చేత బస్ నడిపించాడు. అది ఏక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. డ్రైవర్‌కి లైసెన్స్ లేదనే విషయం బయటపడకూడదని ఓనర్ తన సొంత డ్రైవింగ్ లైసెన్స్ చూపించి సరెండర్ అయ్యాడు. పోలీసులు ఓనర్ మీదే కేస్ రాసారు. ఇప్పుడు ఓనర్ కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాడు.
నక్సల్ సరెండర్స్‌ని కూడా పోలీసులు అంత సులభంగా నమ్మరు. 2011లో సరెండర్ అయిన దున్న కేశవరావుకి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన దున్న కేశవరావు ఒడిశాలో పని చేసాడు. అతను తమకి చెప్పకుండా లొంగిపోయాడని ఒడిశా పోలీసులు ఆంధ్ర పోలీసులకి చెప్పడంతో ఆంధ్ర పోలీసులు అతన్ని ఒడిశా అధికారులకి అప్పగించారు. ఒడిశా అధికారులు అతనికి భుబనేశ్వర్ జైలులో నరకం చూపించారు. కేశవరావు ఒడిశా పోలీసులకి చెప్పే లొంగిపోయాడు. అతను డి.జి.పి. ముందు లొంగిపోవడం వల్ల అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. రెండు రాష్ట్రాలలో అతనితో కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు అడ్రెస్‌లు మార్చేసారు. వాళ్ళ అడ్రెస్‌లు చెప్పలేకపోవడం వల్లే పోలీసులు కేశవరావుకి నరకం చూపించారు. అతను పబ్లిసిటీ కోసం డి.జి.పి. ముందు లొంగిపోయాడు కానీ ఆ పబ్లిసిటీ వల్ల రెండు రాష్ట్రాల్లో అతని కాంటాక్ట్స్ అడ్రెస్‌లు మార్చేసారు. చివరికి కేశవరావే గంగలో మునిగాడు. పది లక్షకు రివార్డ్‌కి ఆశపడి లొంగిపోతే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అయ్యింది.
సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది
Posted
Author
Administrator
Categories
Hope for the future